: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం: జగన్


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. ఢిల్లీలో సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముక్కలు కావడాన్ని తెలుగు వారు భరించలేరని అన్నారు. ఇప్పటికే తాను జాతీయ నాయకులను కలిసి సమైక్యానికి మద్దతు ఇవ్వాలని కోరానని అన్నారు. తాము చేసిన అభ్యర్థన మేరకు ప్రకాశ్ కారత్ సమైక్యానికి మద్దతు తెలుపడం ఆనందం కలిగిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News