: ముక్కు చూడు ... ముక్కందం చూడు!
చైనా యువతీ, యువకుల్లో ఇప్పుడొక సర్జరీ తెగ పాప్యులర్ అయిపోయింది. దాని పేరే ఈఫిల్ టవర్ సర్జరీ. పారిస్ లోని ఈఫిల్ టవర్ పేరు ఈ సర్జరీకి రావడానికి తగిన కారణం కూడా ఉంది. యువతీ, యువకులు తమ ముక్కును అందమైన ఈఫిల్ టవర్ ఆకారంలో చూసుకోవాలని కోరుకుంటున్నారట. ఈఫిల్ టవర్.. పై నుంచి కింది వరకు ఏటవాలుగా ఉంటుందని తెలిసిందే. అచ్చం తమ ముక్కు కూడా అదే వంపుతో ఉండాలని, తద్వారా ఎదుటివారిని మంత్రముగ్దులను చేయవచ్చని వారి భావన. ఇందుకోసం 10వేల డాలర్లు (సుమారు రూ. 6లక్షలు) వరకు చెల్లించడానికి కూడా వెనుకాడడం లేదు. ముక్కు వంపుతోపాటు ముఖాన్ని కూడా ఈ సర్జరీలో అందంగా తీర్చిదిద్దుతారు. ఇన్ని పాట్లకు కారణం ఉద్యోగం సాధించాలన్న తపనేనట. ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనుకునే... ఈఫిల్ టవర్ సర్జరీ బాట పడుతున్నారు.