: రాయల తెలంగాణ ఎవరడిగారని పరిశీలిస్తున్నారు?: సోమిరెడ్డి
రాయల తెలంగాణ ఎవరు అడిగారని కేంద్రం పరిశీలిస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శాసనసభ, శాసనమండలి పంపిన సవరణలు చూసే సమయం కూడా జీవోఎంకు లేదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయకుండా సోనియా గాంధీ ఇంటిముందు దీక్ష చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. సీఎం మౌనదీక్షలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసిన కేంద్ర మంత్రులు... జీవోఎం దగ్గర మాత్రం లాలూచీ పడుతున్నారని ఆయన విమర్శించారు.