: తిరుమలలో శ్రీవారికి వైభవోపేతంగా గరుడవాహన సేవ
ఇవాళ (గురువారం) రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వరస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ వైభవోపేతంగా జరిగింది. అశేష భక్త జనులు జయజయధ్వానాలతో వెంటరాగా.. గరుడ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా హారతులు పట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శ్రీవారికి హనుమంతుని వాహన సేవను నిర్వహించనున్నారు.