: హైదరాబాద్ లో సీమాంధ్రులకు వాటా ఎలా ఇస్తాం?: పొన్నాల


హైదరాబాద్ లో సీమాంధ్రులకు వాటా ఎలా ఇస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో వాటా అడగడం సీమాంధ్రుల వితండవాదానికి నిదర్శనమని అన్నారు. విభజనకు అనుకూలంగా రెండు సార్లు లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, కాలుగాలిన పిల్లిలా నేతలందరి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు తమకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఎప్పుడివ్వాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని పొన్నాల తెలిపారు.

  • Loading...

More Telugu News