: జీవోఎం ఎన్నిసార్లయినా భేటీ అవుతుంది: వీరప్ప మొయిలీ
అవసరం మేరకు జీవోఎం ఎన్నిసార్లయినా భేటీ అవుతుందని జీవోఎం సభ్యుడు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జీవోఎం ఇంకా ఎందుకు సంప్రదింపులు జరుపుతోందనే ప్రశ్నలు అనవసరమని, సవరణలు ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో ఉత్పన్నమైనప్పుడు వాటిని నివారించేందుకు జీవోఎం ఎన్నిసార్లైనా భేటీ అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశంపై అభ్యంతరాలు చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చామని మొయిలీ తెలిపారు.