: రక్తస్రావాన్ని 15 సెకండ్లలో ఆపే సిరంజి
బుల్లెట్ గాయమై రక్తం బడాబడా కారిపోతుంటే.. క్షణాల్లోనే దానికి అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ప్రాణం దక్కడం కష్టమే. ఈ నేపథ్యంలో రెవ్ మెడెక్స్ అనే కంపెనీ ఒక కొత్త రకం సిరంజిని తయారు చేసింది. దీని పేరు ఎక్స్ స్టాట్. బుల్లెట్ గాయమై రక్తస్రావం అవుతుంటే ఈ సిరంజితో గాయమైన చోట ఇంజెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిరంజిలో ఉన్న స్పాంజ్ ముక్కలు బయటకు వచ్చి గాయన్ని మూసేస్తాయి. దాంతో రక్తస్రావం ఆగిపోతుంది.