: ఢిల్లీ గొలుసు దొంగలకు కేరళలో 'ఉపాధి'!
మలయాళీలకు బంగారంపై ఉన్న మక్కువను ఓ జ్యూయెలరీ వ్యాపారి 'లాభదాయకమైన వ్యాపారం'లా ఎలా మలుచుకున్నాడో చూడండి! హాజీ సోనీ.. ఢిల్లీలో ఓ బంగారు ఆభరణాల తయారీదారు. నగలను తయారుచేయడం, అమ్మడం అతని పని. నీతినిజాయతీగా సంపాదించడం ఎందుకునుకున్నాడో.. లేక నీటుగా ఉంటూ వెరైటీ బిజినెస్ చెయ్యాలనుకున్నాడో.. ఓ వినూత్నమైన ఐడియాకు తెరదీశాడు.
ఢిల్లీలో మాంచి చేతివాటం గల కొందరు చైన్ స్నాచర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి కేరళ జాతీయుల బంగారం పిచ్చి గురించి స్థూలంగా వివరించాడు. ఇంకేముంది, డీల్ కుదిరింది. వారు చేయాల్సిన పనల్లా ఢిల్లీ నుంచి కేరళ వెళ్ళి అక్కడి నగరాల్లో మహిళల మెడల్లోంచి గొలుసులు కొట్టుకురావడమే. అవి తీసుకుని హాజీ, వారికి కొంత ముట్టజెప్పేవాడు. ఇలా కొంతకాలం సాగింది.
అయితే, గత శనివారం కథ అడ్డం తిరిగింది. చెట్టికుళంలో దారిన పోతున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు దొంగిలించబోయి.. మహ్మద్ షకీల్, నౌషాద్ అలీ అనే దొంగలు దొరికిపోవడంతో ఈ విస్మయకర వృత్తాంతం వెలుగులోకి వచ్చింది. కాగా, వారిద్దరూ కేరళ రావడం అది మూడోసారట. గత జనవరి నుంచి వారిద్దరూ 11 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారని కేరళ పోలీసులు చెప్పారు. ఇక ఈ 'ఉపాధి కార్యక్రమం' వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హాజీ పనిబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.