: 160 మంది మాజీ మావోయిస్టులను నిర్లక్ష్యం చేశారు: పరిటాల సునీత
160 మంది మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయినప్పటికీ ప్రభుత్వం వారికి ఏ విధమయిన పునరావాసం కల్పించలేదని ఆనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. మాజీ మావోయిస్టుల సమస్యలపై అనంతపురంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను కలిసి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ నక్సలైట్లకు పునరావాసం కల్పించి, మరోసారి వారు హింసాయుత మార్గంలోకి మరలకుండా చూడాల్సిన బాధ్యత, ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 160 మంది మాజీ మావోలకి ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమి మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.