: లంక వ్యవహారంపై పార్లమెంటులో తీర్మానం
తమిళులపై శ్రీలంక సైన్యం దమనకాండకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. లంక దురాగతాలపై ఐరాస మానవ హక్కుల మండలిలో అమెరికా ప్రవేశపెట్టనున్న తీర్మానాన్ని బలపరచడంతో పాటు రాజపక్సను దోషిగా నిలబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్న డీఎంకే.. నేడు యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో, నష్ట నివారణకు ఉపక్రమించిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లంక తమిళుల సమస్యపై తీర్మానం ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.