: జైలుకు పంపిన దొంగ 'ముద్దు'!
దొంగల పాలిట ఓ ముద్దు శాపంగా మారింది. చివరకు ఆ ముద్దే అతడిని పట్టించింది. ఫ్రాన్స్ లో ఇద్దరు దొంగలు ఓ ఇంట్లో దూరారు. యజమాని భార్యపై పెట్రోలు పోసి చంపేస్తామని బెదిరించారు. వారి బంగారు నగల దుకాణం తాళాలు తీసుకుని ఓ దొంగ షాపుకు వెళ్లి డబ్బు, నగలు అందినకాడికి దోచుకున్నాడు. పని పూర్తి చేసుకుని వచ్చి ఇంటి దగ్గర ఉన్న దొంగను తీసుకెళ్లాడు.
అంతసేపు ఇంటి దగ్గర ఉన్న దొంగ యజమానురాలిని ముద్దుపెట్టుకుని మరీ వెళ్లిపోయాడు. అంతే, దొంగలు వెళ్లగానే పోలీసులకు ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె బుగ్గపై ముద్దు ఆనవాళ్లను సేకరించి డీఎన్ఏ టెస్టు చేశారు. డాటాబేస్ ఆధారంగా దొంగ ఎవరో కనిపెట్టేసి పట్టుకున్నారు. ఇప్పడు దొంగ ఊచలు లెక్కిస్తూ, 'ముద్దు ఎంత పని చేసెరా' అని చింతిస్తున్నాడు.