: ఢిల్లీలోని తెలుగువారు కూడా సీఎం దీక్షను పట్టించుకోలేదు: కేటీఆర్


సమైక్యాంద్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తే కనీసం అక్కడి తెలుగువారు కూడా పట్టించుకోలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. అజ్ఞానం, అహంకారం, మూర్ఖత్వం కలగలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. 294 మంది ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిని కూర్చోబెట్టి సమైక్యాంధ్ర అనిపించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించిన కేటీఆర్, బిల్లును తిప్పి పంపినట్లు సీఎం స్పీకర్ తో చెప్పించగలరా? అని అడిగారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ బిల్లు ఆగదన్నారు.

  • Loading...

More Telugu News