: రాష్ట్రపతితో ముగిసిన జగన్ భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ భేటీ కాసేపటి కిందట ముగిసింది. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటు ఎన్నడూ చర్చించలేదని తెలిపారు. అలాంటి దాఖలాల్లేవని చెప్పారు. ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తోందని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవాల్సిందే అని జోస్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తామని తెలిపారు.