: కొత్త రంగు పులుముకున్న గూగుల్ ఫోన్


ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో గూగుల్ సంస్థ తీసుకువచ్చిన ఫోన్ నెగ్జస్ 5. 2013 అక్టోబరు 31న మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ను తొలుత రెండు రంగుల్లోనే విడుదల చేసింది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్. ఎలక్ట్రానిక్ జెయింట్ ఎల్జీతో సంయుక్తంగా రూపొందించిన ఈ ఫోన్ ను అప్పట్లో బ్లాక్, వైట్ వేరియంట్లలోనే డిజైన్ చేశారు. తాజాగా, ఎరుపు రంగులో మార్కెట్లోకి రానుంది. ఈ రెడ్ నెగ్జస్ 5 ఈ నెల నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో భారత్ తో పాటు మరో 11 దేశాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ చెబుతోంది. 16 జీబీ మోడల్ ధర రూ. 28,999, 32 జీబీ మోడల్ ధర రూ. 32,999గా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News