: సత్య నాదెళ్ల ఏడాది జీతం రూ. 112 కోట్లు
మైక్రోసాఫ్ట్ సీఈవోగా పగ్గాలు చేపట్టనున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల వార్షిక వేతనం ఎంతో తెలుసా?.. అక్షరాల రూ. 112 కోట్లు. అయితే బేస్ శాలరీ రూపంలో అందేది మాత్రం ఏడాదికి రూ. 7.5 కోట్లు. స్టాక్ అవార్డులు, బోనస్, ఇన్సెంటివ్ లు వగైరాలు కలిపితే ఈ మొత్తం 112 కోట్ల వరకు పెరుగుతుంది. జీతం మీద ఆయనకు 300 శాతం వరకు బోనస్ అందుతుంది. ఈ వివరాలన్నీ మైక్రోసాఫ్ట్ నుంచి నాదెళ్లకు అందిన ఆఫర్ లెటర్ లో పేర్కొన్నారు. ఇదే లెటర్ కాపీని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా పంపారు. గత ఏడాది నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయల క్యాష్ బోనస్ అందింది. ఇప్పటి వరకు బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి నాదెళ్లనే!