: ఆ రెండు పార్టీల అండతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజనకు తెగబడింది: టీజీ
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీల అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం విభజనకు తెగబడుతోందని మంత్రి టీజీ వెంకటేష్ ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి దీక్షకు దిగారంటే, విభజన వద్దని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానం సరికాదని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా అధిష్ఠానం తీరు మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.