: ఆడియో వేడుకలు రికార్డింగ్ డ్యాన్సుల్లా తయారయ్యాయి: దాసరి
ఇటీవల కాలంలో సినిమా ఆడియో ఫంక్షన్లు జరుగుతున్న తీరుపై దాసరి నారాయణరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాలు రికార్డింగ్ డ్యాన్సుల మాదిరి తయారయ్యాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇలాంటి కార్యక్రమాలకు తాను ఇకపై దూరంగా ఉంటానని చెప్పారు. బాద్ షా సినిమా ఆడియో వేడుక తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ దాసరి ఇవాళ ఘాటైన విమర్శలు చేశారు.