: కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ బిల్లుపై భిన్నాభిప్రాయాలున్నాయి: సుష్మాస్వరాజ్
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లోనే తెలంగాణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ అన్నారు. పార్లమెంటులో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై స్వయానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని కాంగ్రెస్ నేతలే సభను అడ్డుకుంటున్నారని.. వారి అభ్యంతరాలను నివృత్తి చేయలేని కాంగ్రెస్ పార్టీ.. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ఎలా అర్థం చేసుకుని ఉంటుందని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలే రెండు రకాలుగా మాట్లాడుతుంటే, ఏకాభిప్రాయం ఎక్కడ ఉంటుందని ఆమె నిలదీశారు.
అనంతరం నిడోతానియా హత్యోదంతంపై మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. బీజేపీ తరపున ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఆమె తెలిపారు. మరింత పటిష్ఠ రక్షణ చర్యలు చేపడితే విద్యార్థులు బలికారని ఆమె సూచించారు.