: 'మోడీ ప్రసంగాన్ని ఒబామా వీక్షిస్తున్న ఫోటో' హల్ చల్!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగానికి పడిపోయారా! వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది కదా? టీవీలో మోడీ మాట్లాడుతుండగా యూఎస్ అధ్యక్షుడు ఒబామా తీక్షణంగా వీక్షిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటో ను చూసినవారంతా ఆశ్చర్యపోయి తెగ ఆలోచిస్తున్నారు. ఇదేంటా అని అసలు విషయంలోకి వెళితే.. ఆ ఫోటో మార్ఫింగ్ చేసిందని, ఎవరో అలా మార్చి నెట్ లో పెట్టారని తెలిసింది. 2011 జనవరిలో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ప్రసంగిస్తుండగా వైట్ హౌస్ లో ఒబామా చూస్తుండగా తీసిన ఫోటో అని, దానికి మోడీ ఫోటోను జతచేశారనీ వెల్లడయింది. ఇదిలావుంటే, ఆ ఫోటో ను గుజరాత్ లోని నవ్సారి బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారట. దానిపై ఆయన్ను సంప్రదిస్తే.. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని తనకు తెలియదని, చెక్ చేసుకోకుండా తను ఇతరులకు కూడా పంపానని వివరించారు.