: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. విపక్షాల ఆందోళన
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఇటీవల చనిపోయిన ఎంపీల పేర్లను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఇరు సభల్లో చదివారు. అనంతరం మరణించిన ఎంపీలకు పార్లమెంటు సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం వహించి సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి.