: సచిన్ పై పోస్టల్ స్టాంపు విడుదలలో.. నిబంధనల ఖూనీ?


విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ జ్ఞాపకార్థం గతేడాది నవంబర్ 14న (సచిన్ చివరి మ్యాచు ఆడుతున్న రోజు) భారతీయ తపాలాశాఖ 20 రూపాయల విలువగల స్టాంపు విడుదల చేసింది. కానీ, దీని విడుదలలో నిబంధనలు పాటించలేదా? అంటే అవుననే సమాధానం వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా సచిన్ పై స్టాంపు విడుదలలో పాటించిన మార్గదర్శకాల గురించి సుభాష్ అగర్వాల్ గత డిసెంబర్ లో దరఖాస్తు ద్వారా సమాచారాన్ని రాబట్టారు.

కేంద్ర మంత్రి శరద్ పవార్ కోరిన 20 రోజుల్లోపే రూల్ 13 కింద సచిన్ గౌరవార్థం పోస్టల్ స్టాంపు విడుదల అయింది. కానీ, ఈ నిబంధన కింద స్టాంపు విడుదల ప్రతిపాదన ఆమోదం పొందడానికి, డిజైన్ రూపొందించడానికి, విడుదలకు 20 రోజులకుపైనే సమయం తీసుకుంటుంది. మరి సచిన్ కదా మైదానంలో ఆయన బ్యాటు ఎంత వేగంగా కదలాడుతుందో.. పోస్టల్ అధికారులు కూడా అంతే వేగంతో స్పందించారు.

మరొక విషయం ఏమిటంటే.. స్మారక స్టాంపులు ప్రముఖుల మరణానంతరం 10ఏళ్ల తర్వాతే విడుదల చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో జాతి అధినేతల (రాష్ట్రపతి వంటివారు) గౌరవార్థం కూడా వీటిని విడుదల చేస్తారని పోస్టల్ అప్పిలేట్ అథారిటీకి చెందిన రాశిశర్మ తెలిపారు. స్మారక స్టాంపు విడుదలకు సంబంధించిన ప్రక్రియ అయితే సాధారణంగా 20రోజుల్లోపు పూర్తి కాదని పేర్కొన్నారు. అసలు రూల్ 13 కింద బతికున్న ఎవరి పేరిటా స్మారక స్టాంపుల విడుదల చేయడం జరగదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News