: రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనవద్దని విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ
ఈ నెల 7 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనరాదని తమ పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. తమ పార్టీకి తగినంత బలం లేనందున రాజ్యసభ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు, ఆ పార్టీలో చేరిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు కూడా ఈ మేరకు వైఎస్సార్సీపీ విప్ బాలినేని శ్రీనివాస రెడ్డి విప్ జారీ చేశారు.