: మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల నియామకం
ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా తెలుగు వాడైన సత్య నాదెళ్ల ఇవాళ అధికారిక బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీపడ్డారు. చివరగా ఈ పదవి హైదరాబాదులో పుట్టి పెరిగిన సత్య నాదెళ్లనే వరించింది.