: ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పార్లమెంటుకు రాదు: జాతీయ మీడియాతో సీఎం


న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన బిల్లు పార్లమెంటుకు రాదని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోపాలతో కూడిన బిల్లును అసెంబ్లీకి పంపారని, తిరస్కరించిన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని పునరుద్ఘాటించారు. విభజన జరిగితే సీమాంధ్ర కన్నా తెలంగాణకే అధిక నష్టమన్న సీఎం తన భవిష్యత్ కన్నా రాష్ట్ర సమైక్యతే ముఖ్యమని చెప్పుకొచ్చారు. బిల్లు మొదట కేబినెట్, తర్వాత రాష్ట్రపతి, అక్కడి నుంచి పార్లమెంటుకు వస్తుందని కిరణ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News