: ముంబయి ఏటీఎస్ అదుపులోకి భక్తల్
2011, జులై 13న ముంబైలో జరిగిన దాడుల్లో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భక్తల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్ ను అరెస్టు చేసేందుకు 'ముంబయి యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్'కు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు వారిద్దరినీ ముంబయి ఏటీఎస్ అధికారులు కస్డడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అదుపులో ఉన్న వీరిద్దరినీ పలు రాష్ట్రాలకు సంబంధించిన పేలుళ్ల కేసులో విచారించారు. తాజాగా, ఈ కేసు (2011, జులై 13న ముంబై పేలుళ్లు)లో విచారించేందుకు ముంబయి ఏటీఎస్ అనుమతి పొందింది. అప్పటి పేలుళ్లలో ఇరవై మందికి పైగా మరణించగా, 141 మంది గాయాలపాలయ్యారు.