: సచిన్ కోసం అభిమాని ప్రత్యేక గీతం


దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న సందర్భంగా క్రికెటర్ సచిన్ రమేశ్ టెండుల్కర్ పై ఓ అభిమాని ప్రత్యేక గీతాన్ని రూపొందించాడు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించాడు. చూసినవారంతా చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. హైదరాబాదుకు చెందిన ప్రతాప్ రాణా అనే సంగీత దర్శకుడికి సచిన్ పై అపార అభిమానం ఉంది. వెంటనే హిందీ ప్రఖ్యాత రచయిత మనోజ్ యాదవ్ తో సచిన్ పై పాట రాయించాడు. దాన్ని గాయకులు ఆర్మాణ్ మాలిక్, నకాష్ లు పాడారు. వీడియోను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విడుదల చేశాడు.

  • Loading...

More Telugu News