: గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలన్నది కేంద్రం యోచన: సుష్మాస్వరాజ్


విభజన నేపథ్యంలో రాజధాని హైదరాబాదును ఉమ్మడి రాజధాని చేసి గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇందుకు పార్లమెంటులో సవరణలు, ఓటింగ్ జరగాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయని మండిపడ్డారు. విభజన క్రమంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఏకతాటిపైకి తేవడంలో విఫలమైనట్లు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News