: అకటా... దిగ్గజానికి ఎంత దుస్థితి!


ఆస్ట్రేలియా దిగ్గజ స్విమ్మర్ ఎవరంటే, కరెంట్ అఫైర్స్ మీద ఏకాస్త పరిజ్ఞానం ఉన్న వారైనా వెంటనే అతని పేరు చెబుతారు. లేదా ఆటలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారెవరైనా సరే... ఒలింపిక్స్ లో ఐదు స్వర్ణాలు, ఒకే వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఆరు స్వర్ణాలు గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే, అతని పేరు ఠక్కున చెబుతారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే దిగ్గజ స్విమ్మర్ గా నీరాజనాలందుకున్న ఇయాన్ థోర్ప్ ఇప్పుడు మతిస్థిమితం లేని పరిస్థితిలో పోలీసులకు చిక్కాడు. పూర్తి షాక్ లో సిడ్నీలో ఓ కుటుంబానికి చెందిన వ్యాన్ లో కూర్చునేందుకు ప్రయత్నించిన థోర్ప్ ను గుర్తించిన 14 ఏళ్ల బాలుడు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని పునరావాస కేంద్రానికి తరలించారు.

ఆ సమయంలో థోర్ప్ తీవ్ర దిగ్భ్రమకు లోనై ఉండడమే కాకుండా, మత్తులో కూడా ఉన్నాడని సమాచారం. అయితే తాము అదుపులోకి తీసుకున్నది థోర్ప్ అని పోలీసులు వెల్లడించలేదు. థోర్ప్ మేనేజ్ మెంట్ మాత్రం పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్స్ వల్ల థోర్ప్ పరిస్థితి దిగజారిందని, అతను పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. చిన్న వయసులోనే అందలాలు ఎక్కి 2006లో రిటైర్మెంట్ ప్రకటించిన థోర్ప్ దుస్థితిపై క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News