: రాష్ట్రపతి వద్దకు చేరని బిల్లుపై జీవోఎం సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు: ధూళిపాళ్ల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాష్ట్రపతి వద్దకు బిల్లు చేరకుండానే జీవోఎం సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టువంటిదని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి రాష్ట్రపతికి బిల్లు చేరకుండానే జీవోఎం ఏ ప్రాతిపదికన బిల్లుపై చర్చించిందని నిలదీశారు. బిల్లుపై ఎవరు ఏ అభిప్రాయం వెల్లడించారు? అనేది చదివేందుకే సమయం పడుతుందని... సూచనలు, సలహాలు అధ్యయనం చేయకుండా తెలంగాణ బిల్లును తయారు చేశామని పేర్కొనడం కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతుందని ఆయన విమర్శించారు.