: భర్తను చూసి గర్విస్తున్నానన్న నిలేకని భార్య
ఆధార్ కార్డు ప్రోగ్రాం ఛైర్మన్ నందన్ నిలేకని భార్య రోహిణి నిలేకని తన భర్తపై ప్రశంసల జల్లు కురిపించారు. తన భర్త లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. నిలేకని లాంటి జాతీయవాదులు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి రావాల్సి ఉందని... దీనివల్ల దేశం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు బెంగళూరులో క్యాన్సర్ మహిళల కోసం ఒక స్ర్కీనింగ్ యూనిట్ ను ఆమె డొనేట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.