: సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్టీసీ నిర్ణయం
ఏపీఎన్జీవోలు రేపటి నుంచి తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము సమ్మెలో పాల్గొనలేమని స్పష్టం చేసింది. ఆర్టీసీ కూడా సమ్మెలో పాల్గొంటే ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్ల దోపిడీ యధేచ్చగా సాగిపోతుందని సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలో జేఏసీ సమావేశంలో ఈ విషయమై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు వెల్లడించారు.