: రాష్ట్ర విద్యుత్తు కేరళకు పోతున్నా సీఎం మౌనం: ముద్దు కృష్ణమ
రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం కేరళకు తరలిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మిన్నకుండి పోయారని టీడీపీ నేత ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్ళుగానో విద్యుత్తు కష్టాలు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి గ్యాస్ కేటాయించాలంటూ కేంద్రాన్ని ఇప్పుడు కోరడంపై ముద్దు కృష్ణమ ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు ఇంధనం కేటాయించకుండా ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఆధార్ జారీ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని కోరారు.