: 'ఆ 25 మంది ఎంపీలపై కేసు దాఖలు చేయండి'
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటపెట్టిన అవినీతి నేతల జాబితాలోని 25 మంది ఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ ఎసీబీకి సమాచార హక్కు కార్యకర్త ఒకరు దరఖాస్తు ద్వారా కోరారు. కేజ్రీవాల్ ను ప్రాథమిక సాక్షిగా ఆర్టీఐ కార్యకర్త వివేక్ గార్గ్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. విశ్వసించదగిన సాక్ష్యాలు ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చే్యవచ్చన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా గార్గ్ గుర్తు చేశారు. ఈ 25 ఎంపీలలో కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, చిదంబరం, మొయిలీ, సల్మాన్ ఖుర్షీద్, షిండేతోపాటు రాజా, జగన్ మోహన్ రెడ్డి, కనిమొళి, ములాయం సింగ్, మాయావతి, అళగిరి తదితరులు ఉన్నారు.