: పెప్సీ.. విషంతో సమానం: అమితాబ్


ఒకప్పుడు పెప్సీ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసిన అమితాబ్ బచ్చన్ ఇటీవలే.. దాన్ని విషంతో పోల్చారు. ఐఐటీ అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అమితాబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. 'గతంలో పెప్సీకి మద్దతుగా ప్రచారం చేశా. జైపూర్ లోని ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు ఒక బాలిక నన్ను ఒక ప్రశ్న అడిగింది. హానికారక పదార్థాలు ఉన్న పెప్సీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించింది. ఆ తర్వాత ప్రచారాన్ని నిలిపివేశా' అని అమితాబ్ వివరించారు.

  • Loading...

More Telugu News