: ముఖ్యమంత్రి దీక్ష చేపట్టరనే భావిస్తున్నాను: దిగ్విజయ్ సింగ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరాగాంధీ స్మారక చిహ్నం శక్తిస్థల్ వద్ద దీక్ష చేపట్టరని తాను భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపిన తరువాతే తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామని అన్నారు. ఇప్పుడు పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నట్టు తాము వెనక్కి మరలే ప్రశ్న లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి అని, ఆయన దీక్ష చేపట్టే అవకాశం లేదని, వారి అనుమానాలు తెలుసుకునేందుకు సాయంత్రం జీవోఎం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో భేటీ కానుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News