: ఈ నెల 7న రాహుల్ రోడ్ షో
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 7న జార్ఖండ్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక్కడి హజారీబాగ్ నుంచి రాంచి వరకు 75 కిలో మీటర్లు ఈ రోడ్ షో ఉంటుందని ఆ రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రెటరీ శైలేష్ సిన్హా తెలిపారు. దీని ద్వారా వేలమంది ప్రజలను రాహుల్ కలవనున్నారని, వారితో పలు విషయాలపై మాట్లాడతారని చెప్పారు. అంతేగాక రాంచీలో గిరిజన మహిళలు, యువ బృందంతో చర్చలు జరపనున్నారు.