: ఈ సమావేశాల్లోనే టీ బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని చెప్పారు: కేసీఆర్


తెలంగాణ బిల్లును కచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెడతామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అయితే, బిల్లులో సవరణల ప్రతిపాదనలను కూడా ప్రధానికి వివరించామని, తమ అభ్యర్థనలను లిఖితపూర్వకంగా ప్రధానికి ఇచ్చామని చెప్పారు. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు బీఏసీ సమావేశం అనంతరం అన్ని విషయాలపై స్పందిస్తానని అన్నారు. అయితే, ఏపీ భవన్, ఉద్యోగులు-పెన్షనర్లు, విద్యుత్, ఉన్నత విద్య అంశాలను.. గవర్నర్ కు ప్రత్యేక అధికారాల అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని కేసీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News