: జేబులో ఉన్న ఐఫోన్ పేలి.. గాయాల పాలైన విద్యార్థిని


ఎనిమిదో తరగతి చదువుతోన్న ఆ విద్యార్థిని తరగతి గదికి ఐఫోన్ తీసుకెళ్లడమే పొరపాటైంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి జేబులో ఉన్న ఐఫోన్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది. మంటలు అంటుకుని కాలిన గాయాలతో వెంటనే ఆ విద్యార్థిని అప్రమత్తమైంది. ఒక్క ఉదుటున పక్కకు వెళ్లిపోయిన ఆ బాలిక మంటల నుంచి తప్పించుకునేందుకు తన దుస్తులను విప్పేసింది. దాంతో తోటి విద్యార్థినులకు మంటలు వ్యాపించకుండా చేసిందని టీచర్లు చెప్పారు. కాలిన గాయాలతో ఉన్న ఆ బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. అయితే, ఐఫోన్ పేలడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News