: ప్రియురాలి కోసం జైలు కెళ్లిన 80 ఏళ్ల ప్రియుడు


లేటు వయసులో ఘాటు ప్రేమ ఇద్దరు స్నేహితుల మధ్య వైరాన్ని సృష్టించింది. సింగపూర్ కు చెందిన 80 ఏళ్ల లిమ్ సంగ్ చోంగ్, 65 ఏళ్ల చియోంగ్ లు స్నేహితులు. తన ప్రియురాలిలో చనువుగా ఉంటున్న చియోంగ్ పై చోంగ్ కి అనుమానం వచ్చింది. దీంతో అతడిపై చోంగ్ కత్తి విసిరాడు. అది గురి తప్పి దూరంగా పడిపోయింది. ఆవేశంతో ఉన్న చోంగ్ చేతిలో ఉన్న గొడుగుతో దాడి చేశాడు. పారిపోతున్న చియోంగ్ గోడకు కొట్టుకుని గాయపడ్డాడు. దీంతో వీరి వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. నిందితుడైన చోంగ్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను విచారించిన కోర్టు అతనికి జరిమానాతో పాటు ఒక్క రోజు జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News