: ఎస్పీ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదు: ములాయం


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కానుందన్న సమాచారం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, సమాజ్ వాదీ పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల కన్నా ఉత్తరప్రదేశ్ లో ఎస్పీకే అధిక సీట్లు ఉన్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పార్టీ ఎఐఎడిఎంకెతో సీపీఐ, సీపీఎంతో నిన్న, ఈ రోజు పొత్తు కుదుర్చుకున్న అనంతరం ములాయం ఈ ప్రకటన చేయటం గమనార్హం. మరోవైపు కొన్ని రోజుల్లో పధ్నాలుగు పార్టీలతో కలసి థర్డ్ ఫ్రంట్ పై చర్చిస్తామని జేడీఎస్ నేత హెచ్.డి.దేవెగౌడ ప్రకటించారు.

  • Loading...

More Telugu News