: అత్యాచార నిరోధక బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ
పార్లమెంటులో నేడు 'అత్యాచార నేర నిరోధక చట్టం-2013' బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బిల్లుపై చర్చించిన కేంద్ర మంత్రివర్గం.. విపక్షాలు సూచించిన పలు సవరణలు చేసి ఆమోదం తెలిపింది. కాగా, పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనే కనీస వయసుపై వెనక్కి తగ్గిన కేంద్రం 18 సంవత్సరాలనే కొనసాగించేందుకు అంగీకరించింది.