: అవరోధాలు ఉన్నా అధిగమిస్తాం: కేసీఆర్
రాష్ట్ర విభజన బిల్లు విషయంలో పార్లమెంటులో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ స్పష్టంగా చెప్పారన్నారు. ఢిల్లీలో కొంతసేపటి కిందట కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తో కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.