: బీజేపీ నేతలు రూ.20 కోట్లు ఆఫర్ చేశారంటున్న 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే
భారతీయ జనతా పార్టీ నేతలపై 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే మదన్ లాల్ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. బీజేపీకి మద్దతిస్తే రూ.20 కోట్లు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. హస్తినలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముందు రోజు, అంటే, డిసెంబర్ 7న బీజేపీ నేతలు తనను కలశారని పేర్కొన్న మదన్ లాల్.. అందుకు తగిన ఆధారాలు తన వద్ద లేవని ముక్తాయించారు. ఆరోజు తనకో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని, ఓ 'పెద్ద నేత' కలవాలంటున్నారని, ఆ నేత అరుణ్ జైట్లీ అని సదరు వ్యక్తి చెప్పినట్టు మదన్ లాల్ వివరించాడు. తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము మోడీ మనుషులమని, సహకరిస్తే రూ.20 కోట్లు ఇస్తామని చెప్పారని తెలిపారు.