: హస్తినకు క్యూ కట్టిన ఆంధ్రులు


ఆంధ్రప్రదేశ్ దారులన్నీ ఢిల్లీకే వెళ్తున్నాయి. రాష్ట్ర విభజన కీలక తరుణానికి చేరుకుంటున్న దశలో రాజకీయ పార్టీల నేతలంతా హస్తినలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆ పార్టీ అధిష్ఠానం పెద్దలతో భేటీల్లో మునిగి తేలుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలను కలుస్తూ తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగడుతున్నారు.

మరో వైపు తెలంగాణ బిల్లు విషయంలో అన్ని పార్టీలు కార్నర్ చేసిన టీడీపీ అధినేత తమ పార్టీ బృందంతో ప్రతిపక్షనేతగా అన్ని పార్టీల జాతీయ నేతలను కలుస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దూకుడును, రాష్ట్ర పార్టీలను, ప్రయోజనాలను పట్టించుకోని వైనాన్ని విశదీకరిస్తున్నారు. రాష్ట్రపతితో సమావేశమై తన అభ్యంతరాలు తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

మరో వైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేటి సాయంత్రం హస్తిన చేరుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధిష్ఠానం తమను, తమ రాజకీయ భవిష్యత్తును పట్టించుకోవడం లేదని లోలోపల మండి పడుతున్న వీరంతా.. తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఇందిరాగాంధీ సమాధి వద్ద దీక్షకు దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన ఇరు ప్రాంత నేతలు తమ తమ వ్యూహాలతో ఢిల్లీలో రంగప్రవేశం చేయనున్నారు. దీంతో ఆంధ్రభవన్ రాష్ట్రానికి చెందిన పూర్తి స్థాయి రాజకీయనాయకులతో కళకళలాడుతోంది.

  • Loading...

More Telugu News