: నటి షబానా ఆజ్మీకి మరో గౌరవ డాక్టరేట్


బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి న్యూఢిల్లీలోని తెరి వర్శిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. పిబ్రవరి 5వ తేదీ, బుధవారం నాడు జరిగే కార్యక్రమంలో తెరి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనుందని షబానా ఆజ్మీ ట్విటర్ లో వెల్లడించారు. షబానా ఇంతకు మునుపే నాలుగు డాక్టరేట్లు అందుకోగా, ఇప్పుడిది ఐదవది కావడం విశేషం. 2003వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్శిటీ, 2007లో యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ, 2008లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ, 2013లో సిమన్ ఫ్రేజర్ వర్శిటీ గౌరవ డాక్టరేట్ ను షబానాకి ప్రదానం చేశాయి.

షబానా ఆజ్మీ 1974లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన ‘అంకుర్’ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఆమె 120 సినిమాల్లో నటించింది. సామాజిక కార్యకర్తగా బాలల సంరక్షణ, ఎయిడ్ వ్యాధి నిర్మూలన కోసం షబానా ఆజ్మీ సేవలందిస్తున్నారు.

  • Loading...

More Telugu News