: బిల్లులన్నీ ఆమోదించండి.. అందరూ సహకరించండి: కమల్ నాథ్
కేంద్ర మంత్రి కమల్ నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం ప్రారంభమైంది. బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరూ సహకరించాలని కమల్ నాథ్ కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు సహకరించాలని జాతీయ పార్టీలను కమల్ నాథ్ కోరారు. ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను కూడా ఆమోదించేందుకు కలసి రావాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. కాగా ఓట్ ఆన్ అకౌంట్, బడ్జెట్ ప్రవేశపెట్టడం వరకే సమావేశాలను పరిమితం చేయాలని ప్రతిపక్షాలు కమల్ నాథ్ కు విజ్ఞప్తి చేశాయి.
ప్రధానంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో పార్లమెంటు ఎంతవరకు సజావుగా సాగుతుందనేది అనుమానంగా మారింది. బిల్లును ఆమోదింపజేసేందుకు తెలంగాణ ఎంపీలు, బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు ఢిల్లీలో మోహరించడంతో ఆంధ్రభవన్ గరమ్ గరమ్ గా మారింది.