: హైదరాబాదులో దొంగ సొత్తు దొరికింది.. అది ‘ముత్తూట్’దేనా?


చోరీ చేసిన బీహారీ వాలా.. హైదరాబాదు నగరంలో పోలీసుల చేతికి చిక్కాడు. హైదరాబాదు నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో సోమవారం ఉదయం నాలుగు కిలోల బంగారం, భారీ మొత్తంలో నగదును పోలీసులు గుర్తించారు. ఇవాళ (సోమవారం) ఉదయం బీహార్ యువకుడు ఎంజీబీఎస్ మెటల్ డిటెక్టర్ దగ్గర సూట్ కేసును వదిలి పరారయ్యాడు. సూట్ కేసును గుర్తించి తెరచి చూసిన పోలీసులకు.. దానిలో భారీమొత్తంలో సొమ్ము బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బీహారావాలా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోఠి ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, పట్టుబడిన ఈ సొత్తు ముత్తూట్ ఫైనాన్స్ కు చెందినదని ఆ యువకుడు పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News