: కోతి తలచుకుంటే.. వీఆర్వో పరీక్షనూ రాయనీయదు


కోతి తలచుకుంటే కొండనూ ఎక్కించగలదు.. పరీక్ష రాయకుండానూ చేయగలదు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది. రణస్థలంలో వీఆర్వో పరీక్ష రాసేందుకు వికలాంగుడైన రమేష్ చిలకలపాలెం బస్టాప్ కు చేరుకున్నాడు. ఈ లోపు.. ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చింది. ఆగు మిత్రమా అంటూ వచ్చి రమేష్ భుజంపైకి ఎక్కి కూర్చుంది. పాపం దాన్ని విడిపించుకుని రణస్థలం వెళ్లాలని రమేష్ ప్రయత్నించాడు. అయినా నిన్నొదలా.. నే నిన్నొదలా..? అన్నట్లు కోతి రమేష్ భుజంపై నుంచి దిగలేదు. ఇక లాభం లేదనుకున్న రమేష్ కోతితోపాటు ఆటో ఎక్కి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే సమయం మించిపోయింది. అధికారులు అనుమతించలేదు. రమేష్ కలను కోతి అలా కొండెక్కించింది.

  • Loading...

More Telugu News