: టీమిండియాపై 'భారత' స్పిన్నర్ ను ప్రయోగించనున్న కివీస్


ఏళ్ల తరబడి స్పిన్ బౌలింగే భారత్ క్రికెట్ కు బలం. స్పిన్నర్ల అండతో నెగ్గిన మ్యాచ్ లే ఎక్కువ (విదేశీ గడ్డపై మినహాయిస్తే). ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు.. ప్రత్యర్థులపై స్పిన్ అస్త్రం సంధించి విజయాలు అందుకునే టీమిండియాపై కివీస్ కూడా స్పిన్ ఆయుధాన్ని ప్రయోగించాలని తహతహలాడుతోంది. అందుకోసం భారత సంతతి కుర్రాడు ఇందర్బీర్ సింగ్ ను బరిలోకి దింపుతోంది.

పంజాబ్ లోని లుధియానాలో జన్మించిన ఇందర్బీర్ కు నాలుగేళ్ళ ప్రాయంలో అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్ వలస వెళ్లారు. ఆక్లాండ్ లో క్రికెట్ ఓనమాలు దిద్దుకున్న ఈ 21 ఏళ్ళ యువకుడు తొలుత ఫాస్ట్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. అయితే, మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ సూచనతో లెగ్ స్పిన్నర్ గా అవతారమెత్తాడు. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన ఇందర్బీర్ 11 వికెట్లు తీశాడు.

ఇప్పటికే 4-0తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ జట్టు రెండు టెస్టుల సిరీస్ నూ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. సీనియర్ స్పిన్నర్ వెటోరి గైర్హాజరీలో కివీస్ జట్టులో ఇందర్బీర్ ఒక్కడే స్పిన్నర్. తుది జట్టులో చోటు ఖాయమే అయినా, స్పిన్ ఆడడంలో నిష్ణాతులైన భారత బ్యాట్స్ మెన్ ను ఎలా నిలువరిస్తాడో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి తొలి టెస్టు జరగనుంది.

  • Loading...

More Telugu News