: మైక్రోసాఫ్ట్ కిరీటం కోసం.. తెలుగోడితో తమిళుడి పోటీ!


మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి తెలుగువాడైన సత్య నాదెళ్ల ప్రధాన పోటీదారుడిగా ఉండగా.. ఈ పదవి కోసం మరో భారతీయుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. చెన్నైకు చెందిన సుందర పిచ్చయ్య రేసులోకి వచ్చారు. ప్రస్తుతం సుందర పిచ్చయ్య గూగుల్ ఆండ్రాయిడ్, క్రోమ్ ప్రాజెక్టు బాధ్యతలు చూస్తున్నారు. ఆయన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు. ఆయనను తీసుకోవడం వల్ల గూగుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కు దీటైన అప్లికేషన్ ను తయారు చేయవచ్చని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పిచ్చయ్య ఖరగ్ పూర్ ఐఐటీ పట్టభద్రులు. మరి మైక్రోసాఫ్ట్ పగ్గాలు తెలుగోడికా లేక తమిళుడికా..? వీరిద్దరికీ కాకుండా వేరొకరు తన్నుకుపోతారా?.. అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

  • Loading...

More Telugu News